ఉట్చూరు పంచాయతీలో రోసనూరు సోమశేఖర్ ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం

ఉట్చూరు

           సూళ్లూరుపేట ( జనస్వరం ) : నియోజకవర్గం దొరవారి సత్రం మండలంలోని ఉట్చూరు పంచాయతీలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ పాల్గొన్నారు. సుమారు 400 కుటుంబాలను సందర్శించారు. స్థానిక జనసైనికుల ఆధ్వర్యంలో  ప్రతి కుటుంబాన్ని కలుస్తూ , స్థానిక సమస్యలన్నీ ప్రజలను నేరుగా అడిగి తెలుసుకుంటూ పాలనలో మార్పు తీసుకురావాలి కోరారు. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్_కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొరవారి సత్రం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు యల్లంపాటి రిషి, అనిల్, గోపి, దొరబాబు, శివాజీ, లీలా మోహన్, సాయి, అల్లూరయ్య మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.

See also  దక్షిణ నియోజకవర్గంలో నిర్విరామంగా డాక్టర్ కందుల సేవా కార్యక్రమాలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి