మతకామూడి గ్రామంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం

మతకామూడి

          సూళ్లూరుపేట ( జనస్వరం ) :  సూళ్లూరుపేట మండలం మతకామూడి పంచాయతీలో జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని కలుస్తూ పాలనలో మార్పు రావాలని కోరుతున్నానని అన్నారు. జనసేన పార్టీకి ఓట్లు వేసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని 2024 లో ముఖ్యమంత్రిని చేయవలసిందిగా గ్రామ ప్రజలను కోరడం జరిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేనపార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళి కృష్ణా రెడ్డి,  జనసైనికులు పాల్గొన్నారు.

See also  బడ్డుకొండపేటలో గ్రామ గ్రామాన జనసేన కార్యక్రమం నిర్వహించిన విజయనగరం జనసేన నాయకులు