
వరద ముప్పుకి నష్టపోయిన రైతన్నలతో మాకినీడి శేషుకుమారి
పి దొంతమూరు గ్రామంలో జనసేన ఇంచార్జ్ శ్రీమతి మాకినీడు శేషు కుమారి గారు వరద ముప్పుకి గురైన పంట పొలాలని పరిశీలించి అక్కడున్న నష్టపోయిన రైతన్నలు కష్టాలు అడిగి తెలుసుకుని ప్రతి రైతుకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. అక్కడ గ్రామ సచివాలయం అధికారులతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి గారు. ఈ కార్యక్రమంలో బండి ఏసుబాబు, మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, పి దొంతమూరు నాయకులు. కర్రీ హరిబాబు, ఆంజనేయులు, బండి కొండబాబు, మొగలి ఏసుబాబు, బండి వీరబాబు, మొగలి వీరబాబు, దుర్గ, చిన్న, శ్రీను, రమణ మరియు రైతన్నలు, జనసైనికులు పాల్గొన్నారు.









