ఉపాధిహామీ పథక కూలీలకు దాహార్తిని తీర్చిన లోకం మాధవి

ఉపాధిహామీ

        నెల్లిమర్ల ( జనస్వరం ) : పూసపాటి రేగ మండలం రెల్లివలస గ్రామంలో ఉపాధిహామీ పధకంలో భాగంగా పనిచేస్తున్న వారి దగ్గరకి వెళ్లి లోకం మాధవి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లోకం మాధవి మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలలోని ప్రజలు చితికిపోయారని, ప్రభుత్వ పథకాలు కొంతమంది ప్రజలకే చేరువవుతున్నాయి అని అన్నారు. అలాగే రైతాంగం ఎంతో అప్పుల పాలయ్యి మనోవేదనకి గురవుతున్నారని, ఇలాంటి పాలన పోయి, ప్రజా పాలన రావాలి అంటే ప్రజలు మొత్తం ఏకతాటిగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలియజేయాలని లోకం మాధవి కోరారు. ఈ కార్యక్రమం లో గుడివాడ జమ్మిరాజు మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.

See also  అవనిగడ్డ లో " చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ " ప్రారంభించిన మెగా అభిమానులు మరియు జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :