తాగునీటి సమస్యను పరిష్కరించాలని రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ను కోరిన స్థానికులు

తాగునీటి సమస్యను పరిష్కరించాలని రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ను కోరిన స్థానికులు

                    రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ఈ రోజు గంగవరం గ్రామంలో పర్యటించినప్పుడు అక్కడున్న రైల్వే కాలనీలో ప్రజలు మాకు మంచినీటి సదుపాయం లేదని, మంచి నీళ్లు రావడం లేదని, కుళాయి వచ్చేది ఒక అరగంట మాత్రమే వస్తుందని ఇంటికి రెండు మూడు బిందెలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. మాకు తాగడానికి మంచినీళ్లు లేవు అని ప్రజలు చెప్పడం జరిగింది. ప్రజలు నీటి సమస్యలు విన్న వెంటనే పోలిశెట్టి చంద్రశేఖర్ గారు స్పందించి మీకు మంచి నీటి కోసం ప్రభుత్వంతో పోరాడి మీకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని, మీ పోరాటానికి మీతో కలసి నడుస్తామని, మీకు మంచి నీళ్లు వచ్చే వరకు కూడా మీతో కలిసి పోరాటం కొనసాగిస్తామని ప్రజలతో చెప్పడం జరిగింది.

                                     వివరాల్లోకి వెళితే ఎలక్షన్ లో గంగవరం ప్రచారం లో భాగంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఒక బాటిల్ తో గంగవరం ప్రజలు త్రాగుచున్న నీటిని చూపించి ఇవా మీరు త్రాగుతున్న మంచి నీళ్లు??? ఇప్పుడు ఉన్న నీటిని చూపించి మీకు మంచి నీళ్ళు ఇస్తామని హమీ ఇచ్చి గత రెండు సంవత్సరాలు అయినా ఇవ్వకపోవడంతో ప్రజలు త్రాగునీటి సమస్య పై ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీటి సమస్య పై గత నెలలో జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మాట్లాడడం జరిగింది. ఈ మద్యకాలంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ గారిని మీడియా పూర్వకంగా అడగడం జరిగింది. అయినప్పటికీ ఈ నీటి సమస్య తీరకపోవడం తో ఆ నీటి సమస్య చంద్రశేఖర్ గారి ద్రుష్టి కి రావడం తో ప్రజలను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బుంగారాజు, అనిశెట్టి బాబ్జీ, సంపత్, మిధిల్, రాంబాబు నాయుడు, శ్రీపోలిశెట్టి శ్రీను, పెంటపాటి వీరప్రతాప్, తుట్టపు వెంకటనారాయణ, గంగాపాత్రుల తిరుపతిరావు, పెంటపాటి ప్రభాకర్, పిరంశెట్టి వీరబాబు, పాలూరి శివ, పెద్దిరెడ్డి ఆదిబాబు, నక్కా వీరబాబు నంగి వీరన్న, శాఖా రమేష్, అమ్మి రాజు, తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  500 మంది ఇస్రో శాస్త్రవేత్తలకు సన్మానం చేయనున్న కర్ణాటక సర్కార్