
సినిమాల్లోనైనా
రాజకీయాల్లోనైనా
ట్రెండ్ ఫాలో అవ్వడు
ట్రెండ్ సెట్ చేసే
“అంజనా” పుత్రుడతడు
అతి తక్కువ టైంలో
అతి పెద్ద స్టారై
కొన్ని సినిమాలే చేసినా
కొండంత క్రేజ్ తో
అభిమానుల్ని సంపాదించుకున్న
“చిరు” సోదరుడతడు
అభిమానం కాస్త
భక్తి అనే స్థాయికెళ్లి
పవనేశ్వరుడై…..
పవరేశ్వరుడై…
కోటానుకోట్ల భక్తుల
ఇంటి ఇలవేలుపతడు
ఒకవైపు త్రివర్ణ పతాకం
మరోవైపు జనసేన జెండా
తన భుజాలపై ఎత్తుకొని
రాజకీయాలను
శుద్ధి చేయడానికొచ్చిన
గంగా జలమతడు
కులాలు ఐక్యతకై
కాలుష్యం లేని పర్యావరణంకై
ధైర్యమనే గాండీవంతో
దోపిడీ వ్యవస్థను
ప్రక్షాళన చేయడానికొచ్చిన
జనసేనాని అతడు
కంటెంట్ ఉన్నోడికి
కటౌట్ చాలు అన్నట్లుగా…
తన పేరులోని పవర్ తోనే
సమస్య ఎక్కడున్నా
పరిష్కారంకై వెనుకడుగేయని
సమాధానమతడు
నిశ్శబ్దంగా
కనిపించే ఆ మహాముని
సెట్ చేసినదే ట్రెండ్ ఇప్పుడు
నిగూఢంగా
ఆలోచించే ఆ ప్రపంచజ్ఞాని
ఫిక్స్ చేసినది బ్రాండ్ ఇప్పుడు
తెలుగు వారి గుండెల్లో
పవర్ స్టార్ గా రిజిస్టరయిన
“పవన్ కళ్యాణ్” అనే ఆరక్షరాలు
అనంత హృదయాల పవరైందిప్పుడు
నిజాయితీకి మనిషి రూపమై
మానవత్వం కు చిరునామాయైన
ఆ జనసేనుడి
మాటల్లో మహా నాయకుడున్నాడు
చేతల్లో మహాశ్రామికుడున్నాడు
అందుకే అంటున్నాను
రా…. రా……కదలిరా
రా…..రా…..కలిసిరా
జనసేనతో అడుగేద్దాం
జనసేనానితో నడుద్దాం
కాలర్ ఎగరేసి
మరీ చెబుతున్నా
నేను…….
పవన్ కళ్యాణ్ భక్తుడినని!
జనసేనాని సైనికుడినని!!
——————————-
ఆకుల రఘురామయ్య
S/O ఆకుల సత్యమయ్య
# 19-1-196
వినాయక నగర్
అనంతపురం-515005
సెల్ -9866714551
8639348188









