MPP ఉన్నత పాఠశాల మూసివేతను వ్యతిరేకిస్తూ MEO గారికి వినతిపత్రం అందజేసిన కోవూరు జనసేన నాయకులు

     కోవూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలోని కోవూరు మండలం గుమ్మళ్ళదిబ్బ గ్రామంలో ఉండే MPP ఉన్నత పాఠశాల మూసివేతకు వైసీపీ ప్రభుత్వం నుంచి జరిగే కుట్రకోణాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కోవూరు నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో కోవూరు MEO ని కలిసి ఆ పాఠశాలను మూసివేసే విషయమై ఏ ప్రాతిపదికన మూసివెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూసివేతకు సంభందించి పై అధికారుల నుంచి వచ్చిన ఆర్డరు నకలు కాపీలను ప్రతి పేజిని ధృవీకరించి ఇవ్వవలసిందిగా సమాచార హక్కు చట్టం కింద అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్ధిపూడి సుధీర్, నెల్లూరు జిల్లా IT వింగ్ కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ, కోవూరు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, కోవూరు మండల జనసేనపార్టీ అధ్యక్షుడు షేక్ అల్తాఫ్, కోవూరు మండల ఉపాధ్యక్షుడు నరాలసెట్టి మహేష్, కోవూరు మండల జనసేనపార్టీ ప్రధాన కార్యదర్సులు సాయి కృష్ణ, పవన్, ప్రదీప్, సంయుక్త కార్యదర్శి రఘు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  అఖిల కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో రేషన్ కిట్స్ పంపిణీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి