
విద్యుత్ షాక్ తో మరణించిన షేక్ షఫీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన అవనిగడ్డ జనసైనికులు
అవనిగడ్డలో కొన్ని రోజుల క్రితం చల్లపల్లిలో షేక్ షఫీ (42) ఇంటి దగ్గర విద్యుత్ ఎర్త్ వైర్ షాక్ తగిలి మరణించడం జరిగింది. అతను చల్లపల్లి బంగ్లా దగ్గర మటన్ షాప్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇప్పుడు ఆయనను కోల్పోవడం వల్ల కుటుంబానికి జీవనాధారం పోయింది. ఆయన కూతురు ఇంటర్ చదువుతుంది. మానవత్వంతో స్పందించిన జనసేన నాయకులు వారి కుటుంబానికి 6,800 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంజిత్ కుమార్ మడమల, సూదాని నందగోపాల్, మల్లం నాంచారయ్య, భానుచందర్, సోమరౌతు నాంచారయ్య, శీరమ్ కిరణ్, జేపీ నాయకులు పీతా లక్ష్మీ ప్రతాప్ పాల్గొన్నారు.









