
కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బడుగువానిలంక వరద భాదితులకు ఎన్నారైల సహాయం
కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బడుగువానిలంక వరద భాదితులకు ఎన్నారై ల సహాయం చేశారు. ఏదేశమేగినా ఎందు కాలీడిన పొగడరా నీ తల్లి భూమి భారతీని, “మానవ సేవే మాధవ సేవ” . ప్రజా సేవ కోసమే అంకితమైన గౌ” శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు కానుకగా సామాన్యుల క్షేమం కోరి రాజకీయాలకు అతీతంగా సహాయార్థం గా బహరైన్ దేశంలో లో ఉద్యోగం చేసే చెముడులంక వాస్తవ్యులు రాయుడు వెంకటేశ్వర రావు(రాయుడు గోపాలకృష్ణ గారి అబ్బాయి) ఆయన మిత్రులు ఉప్పుటూరి వెంకటేశ్వర్లు, మనపురం సతీష్ కుమార్ , రాకుర్తి ఆనంద్ గారు గార్లు గల్ఫ్ జనసేన బహ్రయిన్ నుంచి ఆలమూరు గ్రామస్థులు ,శ్రీ రాజేష్ చీకర్ మల్లి , కొత్తపేట మండలంకు చెందిన మైగాపుల రామకృష్ణ , గొర్రెల గోపాలకృష్ణ గార్లు కలిసి బడుగువానిలంక గోదావరి వరద ఉధృతి కారణంగా ఇబ్బంది పడుతున్న బడుగు వానిలంక గ్రామానికి చెందిన వంద కుటుంబాలకు 25 నిత్యావసర వస్తువుల కిట్లు పంపిణీ చేయాలని భావించారు.









