
శాంతిపురం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన కేజీ సత్రం జనసైనికులు
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం 7 వ మైలు వద్ద సెప్టెంబర్ ఒకటోతేదీన జరిగిన కరెంట్ షాక్ దుర్దటనలో అశువులు బాసిన జనసైనికులు రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం కుటుంబ సభ్యులను జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో, ఆయన స్పూర్తితో, జనసేన నాయకులు నానబాల లోకేష్ రాయ్, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కే.జీ సత్రం చీకూరుపల్లె గ్రామానికి
చెందిన జనసైనికులు మరియు జనసేనపార్టీ నాయకులు నెహ్రూ రాయల్, దుర్గా రాయల్, దినేష్, సుమన్, కిషోర్, కుమార్, చందు ప్రసాద్, హరీష్, సురేష్, ధరణి, గుణ, బద్రి లతో పాటు శాంతీపురం జనసేన నాయకులు వేణు, కిషోర్, నవీన్, శేఖర్, నవీన్, కృష్ణ మూర్తిలతో పాటు కుప్పం నియోజకవర్గ కన్వీనర్లు రామమూర్తి మరియు రమేష్ గార్లు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరామర్శించి, రాజేంద్ర – సోమశేఖర్ ల కుటుంబానికి రూ.15,000 లు, అరుణాచలం కుటుంబానికి రూ.10,000 లు, తన రెండు చేతులు కాలిపోయి చికిత్స పొందుతున్న హరికృష్ణ కుటుంబానికి రూ.10,000 లు చొప్పున మొత్తం రూ.35,000 లను తోటి జనసైనికులు మరియు కళ్యాణ్ గారి అభిమానుల మధ్యన ఆర్థిక సహాయం చేసి మృతుల సమాధుల వద్ద ఘననివాళులు అర్పించి, క్షతగత్రులైన అరుణ్, సంతోష్లను కలసి పరామర్శించి, దుర్దటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.








