కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకురాలు కాంతిశ్రీ

     ఎచ్చెర్ల, (జనస్వరం) : ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, తామడ పంచాయతీ, సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన నడుపూరు ప్రభాకర్ (22 సంవత్సరాలు) అనే జనసైనికుడి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ బాధితుడిని పరామర్శించి ఆ కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి, జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తరపున, కాంతిశ్రీ తరుపున వైద్యం ఖర్చులు నిమిత్తం 10000/- వేల రూపాయలు ఆర్ధిక సహాయం ఆ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ నాగమణి, లావేరు మండల నాయకులు కాకర్ల బాబాజీ, శంకర్, నాని, నీలం నాయుడు, నారాయణరావు, శ్రీరామ్, శ్రీను(MS), రమేష్, సూర్యారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

See also  విశాఖలో టీమ్ JCF ఆధ్వర్యంలో 50 మంది భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి