
విశాఖలో టీమ్ JCF ఆధ్వర్యంలో 50 మంది భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ
కళ్యాణ్ గారి స్పూర్తి తో జనసేన పార్టీ సిద్ధాంతలు లో ఒకటి ఆయన ప్రతి పేద వాడికి న్యాయమైన నిత్యావసర సరుకులు అందాలి అనే భాగం లో ఈరోజు 50 నిరుపేద భవన నిర్మాణ కార్మికుల కి టీం JCF వారు రెండు వారాలకి సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. టీమ్ JCF సభ్యులు నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారుగా రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారికి సంబంధించిన నిధులని ప్రభుత్వం ప్రక్కదారి పట్టిస్తోంది అని, మొదట ఇసుక కొరత, ఆ తరువాత కోవిడ్ 19 వచ్చాయి అని, ఫలితంగా ఉపాధి కరువైంది అని ఇలాంటి పరిస్థితిలో నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కిన సాయం శూన్యం అని, భవన నిర్మాణ కార్మికుల బాగోగులని చేసుకోవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన 450 కోట్ల సంక్షేమ నిధులని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించారని తెలిపారు. ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అని, కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారని అన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రావడంతో వారికి తగిన సహాయం చేశాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మనోహర్, పరమేష్, మహీంద్ర, శివ, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









