జగ్గయపేటలో 8 రోజులపాటు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జనసేవ కార్యక్రమాలు

జగ్గయపేటలో వారం రోజులపాటు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జనసేవ కార్యక్రమాలు

    జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు 2020కి సంబంధించిన పోస్టర్ ని ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణ జనసేన కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులతో కలిసి ఆయన విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా అధ్యక్షుల వారి జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నామని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో ఆయన సేవాస్పూర్తితో మేము కూడా ఆయన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వార్షికోత్సవాల్లో భాగంగా ఎనిమిది రోజుల పాటు ఈ సేవ కార్యక్రమంలు నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. మొదటి రోజు స్థానిక ఆర్ సి యమ్ స్కూల్ లో గల అనాధ పిల్లలకి పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు పంపిణీ, సర్వ మత ప్రార్ధనలో భాగంగా బిలాల్ మసీదు, బేతేస్తవ చర్చ్, వినాయక స్వామి ఆలయల్లో అధ్యక్షుల వారి పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, అనాధాలకి, వృద్దులకు, యచకులకి అన్నదాన కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, “రక్త దాన” శిబిరం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ మహోత్తర కార్యక్రమాల్లో పాలుపంచుకోవలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, పాషా, హేమంత్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

See also  చంద్రగిరి చరిత్ర తెలుసుకో మనవడా అని చెప్పిన జనసేన ఇంఛార్జి దేవర మనోహర