Logo
Date of Publish : 19 August 2020, 7:42 am
Editor : Sake Naresh

జగ్గయపేటలో 8 రోజులపాటు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జనసేవ కార్యక్రమాలు

జగ్గయపేటలో వారం రోజులపాటు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జనసేవ కార్యక్రమాలు

    జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు 2020కి సంబంధించిన పోస్టర్ ని ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణ జనసేన కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులతో కలిసి ఆయన విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా అధ్యక్షుల వారి జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నామని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో ఆయన సేవాస్పూర్తితో మేము కూడా ఆయన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వార్షికోత్సవాల్లో భాగంగా ఎనిమిది రోజుల పాటు ఈ సేవ కార్యక్రమంలు నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. మొదటి రోజు స్థానిక ఆర్ సి యమ్ స్కూల్ లో గల అనాధ పిల్లలకి పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు పంపిణీ, సర్వ మత ప్రార్ధనలో భాగంగా బిలాల్ మసీదు, బేతేస్తవ చర్చ్, వినాయక స్వామి ఆలయల్లో అధ్యక్షుల వారి పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, అనాధాలకి, వృద్దులకు, యచకులకి అన్నదాన కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, "రక్త దాన" శిబిరం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ మహోత్తర కార్యక్రమాల్లో పాలుపంచుకోవలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, పాషా, హేమంత్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com