రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

    పెదకూరపాడు, (జనస్వరం) : రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల పనిచేయవలసిన అవసరం ఆసన్నమైనదని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పెదకూరపాడు మండలంలోని కాశిపాడులో సోమవారం నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన జెండాను ఆయన ఎగరవేశారు. ముందుగా జనసేనపార్టీ మండల అధ్యక్షులు మల్లెల సలపతిరావు ఆధ్వర్యంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర జనసేన పిఎసి కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, జనసేన నాయకులు సేవరీలు, రమేష్, సురేష్ తదతరులు ఉన్నారు.

See also  పేద కుటుంబానికి హిందూపురం జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాయం