ఇచ్చిన మాట ప్రకారంగా ఇళ్ళు కాలిపోయిన బాధితులకి దుప్పట్లు పంపిణీ చేసిన జనసేన వీర మహిళా శ్రీ కాంతి శ్రీ గారు

ఇచ్చిన మాట ప్రకారంగా ఇళ్ళు కాలిపోయిన బాధితులకి దుప్పట్లు పంపిణీ చేసిన జనసేన వీర మహిళా శ్రీ కాంతి శ్రీ గారు

                ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం పంచాయితీ, దిబ్బలపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి పురిల్లు దగ్దమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి క్రాంతి శ్రీ గారు అగ్ని బాధితులకు పరామర్శించి, వాళ్ళు కుటుంబాలుకు నెల సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. అయితే ఆ రోజు కాంతి శ్రీ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. మీ 7 కుటుంబల బాధితులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తాం అని తెలియజేసారు.  ఈ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ మరియు డా. విశ్వక్షేన్ గారి ఆధ్వర్యంలో బాధితులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకర్ల.బాబాజీ, శివ, తిరు, అప్పలకొండ, జయప్రకాశ్ మరియు దిబ్బలపాలేం గ్రామ జన సైనికులు పాల్గొన్నారు.

See also  జగ్గయ్య చెరువును స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతా : ఉదయ్ శ్రీనివాస్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి