జనసేన పార్టీ ద్వారా కరోనాకి ఉచితంగా హోమియో మందు పంపిణీ చేసిన జనసైనికులు

జనసేన పార్టీ ద్వారా కరోనాకి ఉచితంగా హోమియో మందు పంపిణీ చేసిన జనసైనికులు

      గత కొంతకాలంగా కరోనా మహమ్మారి మన పార్వతీపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎలా విజృంభిస్తోందో మనకు తెలిసిందే. ఒకటి నుండి పది, వంద, వేలల్లోకి వెళ్తోంది. ఇంకా ఈ నెలాఖరుకు దాదాపు అందర్నీ తాకుతుందని వైద్య నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రజల రుణం తీర్చుకొనేందుకు మా వంతుగా “Government of India… ఆయుష్ department” వారిచే సిఫార్సు చేయబడిన “ఆర్సెనికం ఆల్బమ్-30” అనే హోమియో మందును దాదాపు లక్ష మందికి 30 వేల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాము. ఇది తెలంగాణలో ఒక తహశీల్దార్ తన పరిధిలో ప్రభుత్వ ఉత్తర్వులతో పంపిణీ చేసి కరోనాను తరిమి కొట్టి విజయం సాధించారు. కాబట్టి ప్రజలు కరోనా పాజిటివ్ ఉన్నవారు తగ్గడానికి, లేనివారు రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా వాడవచ్చును. ఈ మందు పెద్దవారు 4 గుళికలు, చిన్న వారు 2 గుళికలు ఉదయం, సాయంత్రం భోజనానికి గంట ముందు వేసుకోవాలి. అలా 3 రోజులు వేసుకున్న తర్వాత, మరల 10 రోజుల తర్వాత ఒక డోసు 3 రోజులు వేసుకుంటే కరోనా మీ శరీరానికి చేరదు అని అన్నారు జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో 4 వ వార్డ్ ఇంచార్జ్ జనసేన పల్లే వెంకటేష్, పార్వతీపురం మెగా ఫ్యామిలీ సంఘము ప్రెసిడెంట్ రాజన రాంబాబు, గోర్లి చంటి తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన సిద్ధాంతంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులు పంపిణీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి