
మరోసారి మానవత్వం చాటుకున్న జనసేన పిఠాపురం ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి
4 రోజుల క్రితం మల్లం గ్రామంకి చెందిన ఊట రాజేష్ దివిలి వద్ద బైక్ యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి (రక్తం గడ్డ కట్టగా) కోమాలోకి వెళ్ళాడు. అర్ధరాత్రి కాకినాడ GGH కు తరలించారు. బ్రెయిన్ కి వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి గారి దృష్టికి మల్లం జనసైనికులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి తన భర్త డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ గారికి చెప్పగా, ఆయన అపోలో ఆసుపత్రికి పంపించి, అక్కడ కుదరక, ఇంకొక డాక్టర్ తో మాట్లాడినా, అక్కడ కుదరక వెంటనే న్యూరోసర్జన్ డా. అశోక్ గారిని సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుటకు తగిన సహాయం చేసి, ప్రాణం కాపాడారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈరోజు శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు సన్రైజ్ హాస్పిటల్ కి వెళ్లి రాజేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టం ఉన్నచోట జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని పిఠాపురం ఇంచార్జ్ శేషు కుమారి తెలిపారు. రవి, వై. శ్రీనివాస్, పి. రాంబాబు, సత్తిబాబు, R. కన్యాకర్రావు P.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.









