అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ నాయకులు

జనసేన

          అనకాపల్లి జిల్లా (జనస్వరం) : నక్కపల్లి మండలం మూలపర్ర గ్రామంలో అఖిలపక్షంతో ఏర్పాటు చేసిన విశాఖ – చెన్నై కారిడార్ భూ నిర్వాసితుల సభలో జనసేన తరుపున జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి, రాష్ట్ర కార్యదర్శి బోడపాట్టి శివదత్, పలువురు పార్టీ నాయకులకు పాల్గొన్నారు. అనంతరం గెడ్డం బుజ్జి మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో బాధితుల తరుపున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. శివదత్ మామాట్లాడుతూ నిర్వాసితుల భూములకు జనసేన పార్టీ తరుపున పూర్తి స్థాయి మద్దతు పోరాటం చివరి వరకు వుంటుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గబ్బర్ సింగ్, శంకర్ రావు, తాతారావు, గోవింద రాజులు, పిక్కి గోవిందు, బాడే శ్రీను, పీక్కి స్వామి, నూకరాజు, రాజుసూర్య, నల్లల రాజు, రత్నాజీ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

See also  సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం : జనసేన నాయకులు గొల్లపల్లి వెంకట రమణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :