జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాయకుడిగా ఆటోడ్రైవర్‌

      మహాదేవపూర్‌, (జనస్వరం) : మహాదేవపూర్‌ కు చెందిన ఆటో డ్రైవర్ శేషాజ్వల రాజేష్ ని జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాయకులుగా నియమించారు. జనసేన పార్టీ బలోపేతం చేసేలా ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకువేళ్ళాలనే జనసేన అధినేత శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ఇంఛార్జ్ నేమురి శంకర్‌ గౌడ్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తెలంగాణ రాష్ట్ర యువజన సెక్రెటరీ శ్రీముల హరీష్‌ సూచనల మేరకు రాష్ట్ర యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు వంగా లక్ష్మణ్‌ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో మహాదేవపూర్‌ కి చెందిన ఆటో (డైవర్‌ శేషాజ్వల రాజేష్‌ ని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పార్టీ యువజన విభాగం ఎక్సిక్యూటివ్‌ సభ్యులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా నా మీద నమ్మకంతో నాకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పార్టీ యువజన విభాగం ఎక్సిక్యూటివ్‌ సభ్యులుగా నియమించినందుకు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు అని, ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శేషాజ్వల రాజేష్‌ తెలిపారు.

See also  నెల్లూరు జనసేన పార్టీలోకి హసీనా ఆధ్వర్యంలో చేరికలు