చేనేత కుటుంబానికి అండగా జనసేన పార్టీ

    ధర్మవరం, (జనస్వరం) : ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో గుండెపోటుతో మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబాన్నీ జనసేన నాయకులు పరామర్శించి, ఒక నెల ఇంటి సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తన తండ్రి చనిపోయిన తర్వాత చిన్న కుమార్తె చదువు ఆగిపోవడంతో ఆమె తల్లిగారికి జనసేన పార్టీ తరుపున ఆమె చదువుకు సంబంధించి మేము బాధ్యత తీసుకుంటాం అని ఆ తల్లిగారికి ఆ చెల్లికి భరోసా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జనసేన వీర మహిళ కుమారి రూపా మారిశెట్టి, జనసైనికులు శ్రీశైలం శివకుమార్, శ్రీరాములు, గంగాధర్, ఆది, పుల్లప్ప, అశోక్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

See also  సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగింపును స్వాగతిస్తున్నాము : సర్వేపల్లి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి