రైతులకు అండగా జనసేన పార్టీ : జనసేన నాయకులు అనుకుల రమేశ్

జనసేన

         తణుకు ( జనస్వరం ) : నియోజకవర్గం అత్తిలి మండలం, తిరుపతిపురం వద్ద వయ్యేరు కాలువ పొంగడం వలన సుమారు 800 ఎకరాలు మునిగిపోయి వరి పంట మొత్తం కుళ్ళిపోయి రైతులు బాధపడుతున్న తరుణంలో జనసేన పార్టీ తరపున పోరాటానికి సిద్ధమవుతుందని జనసేన నాయకులు అనుకుల రమేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కారుమూరి పుట్టినరోజు వేడుకల్లో సగభాగం పెట్టినా అక్కడ స్లూయిజ్ నిర్మాణం పూర్తవుతుందని, అట్టి కాని పక్షంలో మా పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద రూ. 25వేలు అందచేయాలని, అలాగే పశువులకు గ్రాసం ఏర్పాటు చేయాలని లేకుంటే మేము రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు.

See also  జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారు : జనసేన నాయకులు