గెద్దాడ గ్రామములో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ

రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం గెద్దాడ గ్రామములో రాజోలు నియోజకవర్గ మామిడికుదురు మండలం జనసేన అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశం, జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గెద్దాడ గ్రామంలో జనసేన ఓటింగ్ శాతం గురించి జనసేన పార్టీ ఓటింగ్ శాతాన్ని గ్రామంలో ఏ విధంగా పెంచుకోవాలి అనేదానిపై చక్కగా వివరించారు రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారు. 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతీ గ్రామంలో కూడా ఇటువంటి విశ్లేషణ చాలా అవసరం. మీటింగ్ అనంతరం పలువురికి జనసేన జెండా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకి నివాళులు