మాడుగులలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 మాడుగుల

       మాడుగుల ( జనస్వరం ) : మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాడుగుల పట్టణంలో జనసైనికులు ఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండ్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను జనసైనికుల మధ్య అనకాపల్లి జనసేన పార్టీ పార్లమెంటరీ సభ్యులు నడుపూరీ రాము పతాకావిష్కరణ చేశారు. జనసేన పార్టీ రంగులతో ఉన్న ప్రత్యేక కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. స్థానిక సెయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు రోబ్బా మహేష్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గండం రాంబాబు, రౌతు ప్రసాద్, జనసేన పట్టణ ఉఫాఅధ్యక్షులు కోళ్ల చిన్న యాదవ్, దయ యాదవ్ మంచాల శివ, గల్లా గణేష్, రాజా, అప్పి పలువురు జనసైనికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు

See also  విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి ఘననివాళులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :