ఈ నెల10న రైల్వేకోడూరులో జనసేన బహిరంగ సభ

   కడప, (జనస్వరం) : కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ నెల 10వ తేదీ(ఆదివారం) జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రైల్వే కోడూరు చేరుకుంటారు. స్థానిక మామిడికాయల యార్డు సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి, జెండా ఆవిష్కరణ చేపడతారు. అనంతరం స్థానిక రైతులతో ముఖా ముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. జనసేన పార్టీ “మహిళా ఉపాధి మేళా” కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన వారికి మెమెంటోలు బహూకరిస్తారు. అనంతరం కడప జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు.

See also  విజయనగరంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు