జనసేన పార్టీ అధినేత కోలుకోవాలని రైల్వే కోడూరులో జనసేన నాయకుల పూజలు

             జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుట పడాలని, ఆయన కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని కోరారు. రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యకర్తలు నేడు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనకుల గోత్రం, మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని జనసైనికులు అందరూ దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు గంధం శెట్టి దినకర్ బాబు, సుబ్రహ్మణ్యం, సాయం విద్యాసాగర్, అల్లం శ్రీనివాసులు, పటం రవికుమార్, రమణ, గిరిధర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన చీమకుర్తి మండల జనసేన నాయకులు