జనసేన పార్టీ ఆధ్వర్యంలో కరోనా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గం, పెద్దారవీడు మండలంలో కరోనాతో బాధపడుతున్న బాధితులకు ఉచితంగా మందులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. జనసేన నాయకులు చిన్నా పాల్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మందుల కొరత ఉందని, దొరికినా మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. నిరుపేదలు ఇలాంటి పరిస్థితుల్లో మందులు కొనే పరిస్థితుల్లో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి కోసం జనసేన పార్టీ తరుపున శ్రీ పవన్ కళ్యాణ్ గారి జనసేవ కార్యక్రమం ద్వారా మందులు అందిస్తున్నామని అన్నారు. మండలంలో ఎవరికి మందులు కావాలన్నా అందిస్తామన్నారు. పెద్దారవీడు మండలానికి సంబంధించిన వారికి మాత్రమే అని అన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 8247097577

See also  ఇబ్రహీంపట్నములో జనసేనపార్టీ రచ్చబండ కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి