జనసేన నాయకులు ధర్మేంధ్ర ఆధ్వర్యంలో గంజాయి సాగును ఆపాలని నిరసన వ్యక్తం

గంజాయి

         విశాఖపట్నం ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు ధర్మేంధ్ర ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన మీద అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా G.V.M.C గాంధీ విగ్రహం నుంచి జగదాంబ కూడలి వరకు ప్రజలకు అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ధర్మేంధ్ర మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మా విన్నపం ఏంటంటే మీ పిల్లలపై ఒక కన్నేసి ఉంచండి. గంజాయి ముఠా యొక్క వ్యాపారానికి ముఖ్య టార్గెట్ యువతీ, యువకులు. కాబట్టి వాళ్ళ వలలో మన పిల్లలు పడకుండా మనకి మనమే కాపాడుకోవాలని అన్నారు. బాధ్యతగా వ్యవహరిస్తూ గంజాయిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో దాదాపు పాతిక వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందన్న సంగతి ప్రభుత్వ అధికారులకు, పాలక పక్ష నాయకులకు తెలియదంటారా? అని ఆగ్రహించారు. సరిహద్దు కూడా లేని ఆంధ్రా నుంచి గంజాయి మా రాష్ట్రానికి రవాణా అవుతోందంటే ఖచ్చితంగా ఇది ఆంధ్రా అధికార యంత్రాంగం వైఫల్యమే అని అన్నారు. 

See also  ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : అనంతపురం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు టి.సి వరుణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :