గుంతకల్లును జిల్లా కేంద్రంగా చేయాలని జనసేన నాయకులు నిరసన దీక్ష

      గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ శ్రీ Dr బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గుంతకల్లు జిల్లా సాధన సమతి వారు చేపట్టిన “నిరసన దీక్ష” కార్యక్రమంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, తాడిపత్రి విజయకుమార్, గుంతకల్ జనసైనికులు ఆర్ సి సురేష్, సోహెల్, దశరథ్, మహేష్, మనీ, ఫిరోజ్, రవి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అన్ని అర్హతలు కలిగిన గుంతకల్లును జిల్లా చేయకపోవడం చాలా బాధాకరం. రోడ్లు వేయండి, అనీ అడిగితే జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు కడతాము గాల్లో ఎగరండి అని.. ఉద్యోగులకు న్యాయం చేయండి అని అడిగితే ఉద్యోగులకు ఎస్మా ప్రయోగిస్తామని భయపెట్టడం కరెంట్ కట్ చేస్తూ చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం ప్రజా సమస్యలు తీరుస్తూ తూతూమంత్రంగా రెవెన్యూ డివిజన్ అనీ ప్రకటించడం కాకుండా గుంతకల్లును జిల్లాగా ప్రకటించాలి అనీ డిమాండ్ చేశారు.

See also  అగ్ని ప్రమాదానికి గురైన బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి, జనసేన నాయకులు