జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉరవకొండ నియోజకవర్గ జనసేన నాయకులు

ఉరవకొండ

      జనంలోకి జనసేన కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో జనసేన నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కమలపాడు గ్రామంలో జనసైనికులతో కలసి ఆ గ్రామ ప్రజల అవస్థలు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న రోడ్ల పరిస్థితిని గమనించారు. వర్షాకాలం వస్తే మురుగు నీరు అంతా రోడ్లపైకి వచ్చి అస్త్య వ్యస్తంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థను, రోడ్ల పరిస్థితిని తొందరలోనే ఎమ్మోర్వో గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం ఆలోచిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో ఎవరికి ఏం సమస్య వచ్చినా పోరాడటానికి అండగా ఉంటామని స్థానిక ప్రజలకు భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  రత్నగిరిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం, స్థానిక ఎన్నికల బలోపేతం గూర్చి చర్చ