భువనేశ్వరిని కలిసిన జనసేన నేతలు

      తిరుపతి ( జనస్వరం ) : నారా భువనేశ్వరిని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి చిత్తూర జిల్లా 14 నియోజకవర్గాల రాష్ట్ర, జిల్లా, మండలాల నేతలు శుక్రవారం నారావారిపల్లెలో కలిశారు. ఆమె చేస్తున్న “నిజం గెలవాలి” కార్యక్రమానికి మద్దతు తెలిపారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడిపి నేతలతో కలిసి ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు అరెస్ట్ కాగానే ఆయనకు అండగా నిలిచిన ఏకైక దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అని ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు & అనుబంధ విభాగాల నాయకులు, ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, వీర మహిళలు పాల్గొన్నారు.

See also  రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి