మార్చి14వ తేదీన జరిగే ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను విడుదల చేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన నాయకులు

     కళ్యాణదుర్గం, (జనస్వరం) : ఈరోజు అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ TC వరుణ్ గారి ఆధ్వర్యంలో మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జనసైనికుడు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్, సెట్టూరు మండలం కన్వీనర్ లేపాక్షి ఈరన్న, ‌ బ్రహ్మసముద్రం మండలం కన్వీనర్ ఆంజనేయులు, కుందుర్పి మండల కన్వీనర్ జై కృష్ణ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

See also  SSBN కళాశాల విద్యార్థులకు అండగా నిలిచిన జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారిని సన్మానించిన విద్యార్థులు