
సాలూరు పట్టణంలో మట్టి వినాయక ప్రతిమలు పంచిన జనసేన నాయకులు
సాలూరు పట్టణంలో మట్టి వినాయక ప్రతిమలు పంచిన జనసేన నాయకులు వినాయక చవితి సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఇళ్లలోనే వినాయక చవితి జరుపుకోవాలి అని కరోనా మహమ్మారి నుండి అతి తొందరగా ప్రపంచాన్ని గణ నాధుడు గట్టెకించాలని కోరుతూ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను జనసేన నాయకులు పంచిపెట్టారు. కరోనా కారణంగా జనాలు గుంపుగా ఉంటే ప్రమాదం అని, ప్రభుత్వం వినాయక మండపాలకు పర్మిషన్ ఇవ్వకుండా, వేలమంది జనాలు ఉండే మద్యం షాపులకి పర్మిషన్ ఇవ్వడం దారుణం అని అన్నారు. అలాగే వినాయక విగ్రహాల ఎత్తుపై ప్రభుత్వం ఒక నెలముందుగా ఇటు భక్తులకు అటు విగ్రహాలు తయారు చేసే వారికి తెలియచేసి ఉంటే బాగుండు అని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి ఇళ్ళకే పరిమితమై కేవలం మట్టి వినాయకుడి విగ్రహానికి మాత్రమే పూజలు చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు రేగు మహేశ్వర రావు, శివకృష్ణ, పరశురాం, సంతోష్ ,రవి తదితరులు పాల్గొన్నారు.









