ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

     శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని వరి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జనసేన పార్టీ తరపున ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు రైతులుతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడంతో, ఆ ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం లేక అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలే శరణ్యంగా యోచనలో ఉన్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకటరమణ, అప్పలనాయుడు, రామారావు, నాయుడు, సరుబుజ్జిలి మండల జెడ్పీటీసీ అభ్యర్ధి పైడి.మురళీ మోహన్ మండల నాయకులు ధనుంజయ్, వాసు, నాగరాజు, రమణ, శ్రీధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  డిసెంబర్ 5వ తేదీన రేపల్లె నియోజకవర్గంలో జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా జనసేనపార్టీ నాయకులు