శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని వరి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జనసేన పార్టీ తరపున ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు రైతులుతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడంతో, ఆ ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం లేక అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలే శరణ్యంగా యోచనలో ఉన్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకటరమణ, అప్పలనాయుడు, రామారావు, నాయుడు, సరుబుజ్జిలి మండల జెడ్పీటీసీ అభ్యర్ధి పైడి.మురళీ మోహన్ మండల నాయకులు ధనుంజయ్, వాసు, నాగరాజు, రమణ, శ్రీధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com