విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న గ్రంథాలయానికి కుర్చీలు పంపిణీ చేసిన జనసేన నాయకుడుమోక్షజ్ఞ చంద్రమౌళి

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న గ్రంథాలయానికి కుర్చీలు పంపిణీ చేసిన జనసేన నాయకుడు  మోక్షజ్ఞ చంద్రమౌళి

                  ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డ్ జనతా కాలనీలో గల  లైబ్రరీ కి 60వ వార్డ్ జనసేన కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీ మోక్షజ్ఞ చంద్రమౌళి గారు లైబ్రరీ కి వచ్చే వాళ్ళ కోసం సరిపడా కుర్చీలను ఈరోజు అందించారు. చాలా ఏళ్ళ నుంచి లైబ్రరీ ఉన్నపటికీ, అధికార పార్టీ గాని, అధికారులు గాని, స్పందించలేదు. వార్డ్ పర్యటనలో భాగంగా  లైబ్రరీని పరిశీలించారు. అక్కడ లైబ్రరీలో చదువుతున్న వాళ్ళు అందరూ కూడా నించోని ఉండడం చూసి, వెంటనే అక్కడ ఉన్న సంబంధిత అధికారిని పిలిచి వెంటనే కుర్చీలను కొని ఇచ్చారు. మోక్షజ్ఞ చంద్రమౌళి గారు మాట్లాడుతూ గ్రంథాలయం మనకు ఎంతో జ్ఞానాన్ని పెంచుతుందని, చాలా మంది యువత, పెద్దలు పుస్తక కాలక్షేపం కోసం తరుచూ లైబ్రరీకి వస్తూంటారని, ఇక్కడ తగిన సౌకర్యాలు లేకపోవడం బాధాకరం అనిపించింది. లైబ్రరీ సిబ్బంది కూడా ఉన్నత అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని అన్నారు. ఈ విషయం నా దృష్టికి రావడంతో సహృదయంతో సరిపడా కుర్చీలు పంపిణీ చేశామని అన్నారు. 

See also  ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఎందుకు? జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి