ప్రమాదావశాత్తూ మరణించిన జనసైనికుడు కిరణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాకారం అందించిన జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు

ప్రమాదావశాత్తూ మరణించిన జనసైనికుడు కిరణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాకారం అందించిన జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు

      విశాఖలో 49వ వార్డు బర్మా కాలనీ లో నివాసం ఉంటున్న  జన సేనపార్టీ జన సైనికుడు ” కిరణ్ కుమార్ ” ఈ నెల దీపావళి రోజున ప్రమాదవశాత్తు చెట్టు పడి మరణించడం జరిగింది.  అతని కుటుంబం దయనీయమైన స్థితులో ఉండటాన్ని జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గం నాయకులు, సురక్ష హాస్పిటల్ సి.ఎం.డి శ్రీ డా..బొడ్డేపల్లి రఘు గారి దృష్టికి తీసుకు వచ్చారు.  రఘు గారు ఆ కుటుంబాన్ని కలిసి 10,000 రూపాయలు చేయుతగా అందజేసారు. చనిపోయిన కిరణ్ కుమార్ గారికి 3 సంవత్సరాల బాబు, 13 నెలల పాప ఉన్నారు. ఈ పిల్లల ఇద్దరి పేరు మీద  ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తానని అన్నారు.  అలాగే ఆ కుటుంబానికి ఆరోగ్య రీత్యా , విద్య రీత్యా, అన్నివిధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి మానవతా దృక్పథంతో అన్ని విధాలుగా ఆదుకుంటామని వాళ్లకి మనోధైర్యం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు. తదితరులు పాల్గొన్నారు. 

See also  ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతిపత్రం