ప్రమాదంలో మరణించిన జనసైనికుడు మునగాల రవి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన గల్ఫ్ NRI సంస్థ

ప్రమాదంలో మరణించిన జనసైనికుడు మునగాల రవి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన గల్ఫ్ NRI సంస్థ

                 జనసేన పార్టీ పెట్టిన తర్వాత జనసేన క్రీయాశీలక సభ్యత్వం, జనసేవ కార్యక్రమాల వరకూ ఎంతో చురుకుగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల మండలం దాచేపల్లి గ్రామం మునగా రవి అకాల మరణం ఆ తల్లికి తీరని లోటు. జనసేన కుటుంబం ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది అని భరోసా కల్పిస్తూ జనసేన గల్ఫ్ NRI సంస్థ తరుపున వారి కుటుంబానికి 5,000″రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సహాయాన్ని స్థానిక జనసైనికులు  సత్తెపల్లి వెంకట ప్రసాద్ శంకర్,  గుంటూర్ పవన్ కుమార్,   శెట్టి సునిల్,  రాజ రాయల్ అందించడం జరిగింది.  కుటుంబ సభ్యులందరికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. జనసైనికులు మాట్లాడుతూ వృత్తి రీత్యా ఇతర దేశాలలో ఉంటూ NRI గల్ఫ్ జనసైనికులు పార్టీ కోసం ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశారని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 750+ ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చారని గుర్తు చేశారు. 

See also  గిరిజన ప్రాంతాల్లో జనసేన పార్టీ పర్యటన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి