గుమడ గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

జనసేన

     విజయనగరం ( జనస్వరం ) : కురుపాం నియోజక వర్గం కొమరాడ మండలం గుమడ గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జనసైనికులు పార్వతీపురం నుంచి భారీ ర్యాలీతో ఆహ్వానం పలికారు. గుమడ గ్రామం చేరుకున్న వెంటనే గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు తెలుసుకున్నారు.. గ్రామ ప్రజలు యువతి యువకులు మహిళలు బ్రమ్మరథం పట్టారు. ఆడపడుచులు హారతులు పట్టి వీర తిలకం దిద్ది సాదర స్వాగతం పలికారు. వృద్ధులు స్వచ్ఛందంగా వచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి కురుపాం, బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గం జనసైనికులు పాల్గొన్నారు.

See also  అక్రమ అరెస్టులతో ప్రశ్నించేతత్వాన్ని ఆపలేరు ? జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి