2024 జనరంజక పాలనే నందమూరి కిచ్చే అసలైన నివాళులు

   గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : పెనుమూరు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారవు 28 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి Dr యుగంధర్ పొన్న హాజరయ్యారు. జనహృదయ నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా యుగంధర్ మాట్లాడుతూ 2024 లో జనరంజక పాలన అందించడమే అసలైన నివాళులు అని కొనియాడారు. ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబు లకే సాధ్యమని తెలిపారు. నియోజకవర్గం మరియు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒకసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు లకు అవకాశం ఇవ్వాలని హృదయ వేడుకోలని విజ్ఞప్తి చేసారు. 1983 సంవత్సరం లో ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ ఆదర్శ ప్రాయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షులు లోకనాథం నాయుడు, జిల్లా కార్యదర్శి భాను ప్రసాద్, పెనుమూరు మండల ఉపాధ్యక్షురాలు రేణుక, ప్రధాన కార్యదర్శి గురు ప్రసాద్, ఉపాధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శులు, శేఖర్, రాజు, నాగేంద్ర, కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటినగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, కార్వేటి నగర్ మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్సులు హరీష్, రుద్ర, జిల్లా సంయుక్త కార్యదర్సులు రాఘవ, నరేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చార్లెస్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు మహేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేష్, ఎస్ఆర్ పురం మండలం జనసేన పార్టీ నాయకులు చంద్ర, గంగాధర్ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు రాము, ప్రధాన కార్యదర్శి జీసన్, దాము, మండల బూత్ కన్వీనర్ తులసిరామ్, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, కార్వేటి నగర్ మండల కాపు యువసేన అధ్యక్షులు వెంకటేష్, నాయకులు దేవా జనసైనికులు పాల్గొన్నారు.

See also  అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు