
రైతులకు తక్షణ సాయం ఇవ్వాలని జనసేన దీక్ష : ఎమ్మిగనూర్ ఇంచార్జ్ రేఖా గౌడ్
నివర్ తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణ సాయంగా ఎకరాకు రూ,10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ఆధ్వర్యంలో సోమప్ప కూడలిలో సోమవారం రోజు నిరాహారదీక్షను చెప్పట్టారు, ఈ సంధర్బంగా జనసేన దీక్షను ఉద్దేశించి ఇంచార్జి రేఖగౌడ్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహారదీక్షలు చేస్తున్నట్లు తెలిపారు,నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధినేత దెబ్బతిన్న పంటలను దగ్గరుండి పరిశీలించి జరిగిన నష్టాన్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం త్వరగా సాయం అందించాలని రైతుల పక్షాన నిలబడి పోరాడుతుంటే ప్రభుత్వం నుంచి చలనం రావట్లేదని గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు నేను ఉన్నాను నేను చూశాను అని చెప్పి అధికారం రాగానే నాకు కనపడటం వినబడటం లేదు అనే ద్వంద వైఖరి ప్రదర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని రైతు పక్షపాతి అన్న ప్రభుత్వం నివర్ తుపాన్ బాధిత రైతులకు ఏమి చేసిందని ప్రశ్నించారు, రైతుల వెన్ను విరిచిన నివర్ తుపాన్ బాధితులను తక్షణ సాయం అందించడంలో ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటన్నారు, నష్టపోయిన పంటలను పరిగణనలోకి తీసుకొని పూర్తి సాయంగా ఎకరాకు రూ.35 వేలు నష్ట పరిహారం చెల్లించాలని జనసేనపార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు నిరాహారదీక్ష కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా, ఎమ్మిగనూరు మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్,పద్మావతి,పట్టణ నాయకులు,గాజుల వెంకటేష్, రవి ప్రకాశ్,షబ్బీర్,ఉపేంద్ర యాదవ్, గోనెగండ్ల మండల అధికార ప్రతినిధి జాని,ప్రధాన కార్యదర్శి రామంజి నేయులు, హరికృష్ణ, షఫీ చాంద్ తదితరులు పాల్గొన్నారు.








