శృంగవరపుకోటలో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసైనికులు

శృంగవరపుకోటలో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసైనికులు. 

 శృంగవరపుకోటలో జనసేన, బీజేపీ కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి తగు తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు మాట్లాడుతూ అధికారులు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ వేగవంతం చేయాలని అందుకు తగ్గట్టుగా కోవిడ్ 19 మెడికల్ కిట్లు తగినంతగా సప్లై చేయాలని క్వారంటైన్ సెంటర్ లో  పాజిటివ్ వచ్చిన వారికి, సెల్ప్ క్వారంటైన్ ఆపేసి క్వారంటైన్ సెంటర్లలో ఉంచి రోగులకు నాణ్యమైన ఆహారం, వైద్యం సకాలంలో అందించాలని ప్రభుత్వ వారిని జనసేన నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బీజేపీ యస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త  ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటిస్తూ, ఆరోగ్య నియమాలు పాటించాలని ప్రజలు కి విజ్ఞప్తి చేశారు. సేవ భారతి టోలు ప్రీ నెంబర్ 04048214920 కి కాల్ చేసి తగిన సహాయం కొరకు వాడుకోవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు SRB రూపేష్, జనసేన నేతలు వి. సతీష్ మారే రాజు తది తరులు పాల్గొన్నారు.

See also  కొల్లాపూర్ నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనపార్టీ బరిలో ఉండబోతుంది : జనసేన నాయకులు బైరపోగు సాంబశివుడు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి