రైతులకు తక్షణ సహాయం చేయాలి : జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

రైతులకు తక్షణ సహాయం చేయాలి : జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

               నివర్ తుఫాను బాధితులకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులకు తక్షణ సహాయం కింద ఎకరాకు ముప్పైఐదు వేలు మరియు బాధిత రైతులకు పదివేలు చప్పున సహాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసిన విషయం విధితమే. ప్రభుత్వం ఈ డిమాండ్ కు స్పందించికపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు కలక్టరేట్ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరాహారదీక్షను జనసేన పార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో చేపట్టారు.

              ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈసందర్భంగా జనసేన నాయకులు బాలు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు నిరాహారదీక్షను చేపట్టామని,పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, జనసైనికులు, ఝాన్సీ వీరమహిళలు దీక్షలు చేపట్టారని ఈ స్పందనలకు ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి తక్షణమే రైతులకు ఆదుకోవాలని, వ్యవసాయం అనేది గిట్టుబాటు ధర కోసం కాకుండా లాభసాటి ధరకోసం ప్రభుత్వం కృషిచేయాలని అన్నారు. రైతులకోసం ప్రభుత్వం దిగిరాక పోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేశాలమేరకు ఉద్యమాన్ని మరింత ఉదృతంగా పోరాడతామని అన్నారు. ఈ దీక్షా శిబిరానికి మద్దతుగా బీజేపీ నాయకులు శ్రీ బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి గారు, లోక్ సత్తా నాయకులు శ్రీ నాగభూషణం గారు, శ్రీ రాజారావు గారు, సామాజిక న్యాయ ఉద్యమ వేదిక అధ్యక్షులు శ్రీ గంటాన అప్పారావు గారు, సమతా సైనికదళ్ అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ గారు, అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు శ్రీ మజ్జి సత్యనారాయణ గారు విచ్చేసి సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్షాసమయం ముగియడంతో విజయనగరం జిల్లా అభివృద్ధి వేదిక నాయకులు శ్రీ గోకా రమేష్ బాబు గారు ఈ సామూహిక శిబిరాదీక్షలో పాల్గున్న జనసేన నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షాశిబిరంలో జనసేన నాయకులు లోపింటి కళ్యాణ్, వడిగి భాస్కరరావు, రవిరాజ్ చౌదరి, పళ్లెం కుమారస్వామి, పిడుగు సతీష్, హుస్సేన్ ఖాన్, కాళ్ళ భవానిశంకర్, ఏంటి రాజేష్, శ్రీ వంక నరసింగరావు గారు, సురేష్, వేణు, చిన్న, చక్రి, సునీల్ తదితరులు హాజరయ్యారు. 

See also  జనసేన మద్దతుదారులను వెలివేయాలని వైసీపీ నాయకులు చెప్పటం దారుణం