అభివృద్ధి దిశలో పంచాయతీలకు జనసేన తోడ్పాటు అందిస్తాం : గునుకుల కిషోర్

నెల్లూరు, అక్టోబర్ 7, (జనస్వరం) : అట్టడుగు గ్రామాల అభివృద్ధి ద్వారా గ్రామ స్వరాజ్యం సాధించాలనే పవన్కళ్యాణ్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో, నెల్లూరు జిల్లాలోని ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాల స్థితిగతులను తెలుసుకునేందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల ఆరా తీశారు. నెల్లూరు రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ఆయన సమావేశమై చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల వివరాలను కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో శుచిత, వ్యర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టిన తరుణంలో, ఈ కేంద్రాల పనితీరు కీలకమని కిషోర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్ని కేంద్రాలు పనిచేస్తున్నాయి, ఇంకా ఎన్ని అవసరం ఉంది, క్లాప్ మిత్ర సభ్యులు ఎంతమంది ఉన్నారు, సేకరణ–కంపోస్టింగ్ పనులకు అవసరమైన సిబ్బంది సంఖ్య ఎంత ఉండాలని వంటి అంశాలపై వివరాలు అందించాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. పంచాయతీరాజ్ అభివృద్ధి కోసం అవసరమైన ప్రతి చోట జనసైనికులు వాలంటీర్లువలే పనిచేయడానికి సిద్ధమని కిషోర్ గునుకుల స్పష్టం చేశారు. గ్రామాల నుంచి అభివృద్ధి మార్గం ప్రారంభమవుతుందనే తత్వంతో పవన్కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

See also  ఆత్మకూరు నియోజకవర్గ సమస్యల గురించి పి‌ఏ‌సి సభ్యులు నాగబాబుకి వివరించిన నలిశెట్టి శ్రీధర్