చిత్రాడలో ఇంటింటికీ జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ఉత్సాహం

పిఠాపురం, ఫిబ్రవరి 22, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం చిత్రాడ గ్రామంలోని శెట్టిబలిజ వార్డులో ఉత్సాహభరితంగా నిర్వహించారు. డోర్ టు డోర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ స్వయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు పెరుగుతున్న ప్రజా మద్దతు ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సంకల్పం, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయం పట్ల ఉన్న అంకితభావం కారణంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను నేరుగా ప్రజలకు చేరవేస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, యువతకు అవకాశాలు, మహిళా సాధికారత సాధనలో జనసేన ముందుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  బళ్లారికి తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు: ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి