డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలి : తణుకు జనసేన నాయకులు

అంబేద్కర్

     తణుకు ( జనస్వరం ) : తణుకు నియోజకవర్గం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్  విడివాడ రామచంద్రరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పాడు చేయడం అనేది చాలా బాధాకరమని దీనికి బాధ్యులైన వారిని ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఇటువంటి విషయాలు భవిష్యత్తులో జరగకుండా దోషులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

See also  టీబీ వ్యాధితో బాధపడుతున్న అప్పారావుకు రూ. 10,000 సహాయం అందించిన భీమిలి జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :