జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండలం జనసైనికులతో సమావేశం

జనసేన - జనం వద్దకు జనసేన

          పార్వతీపురం ( జనస్వరం ) : 12వ రోజు గిరి సేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండలం జనసైనికులు తో సమావేశం వీరఘట్టం మండలంలో, జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల సహకారంతో, ప్రతి ఇంటింటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాలను మరియు రాష్ట్రములో గతంలో మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను ఏ విధంగా, మభ్యపెట్టి మోసం చేస్తున్నాయో, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది.. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, గాజు గ్లాస్ గుర్తు – జనసేన పార్టీని  బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలని మత్స. పుండరీకం, జనసేన జాని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మరియు జనసేన కార్యకర్తలు, గోపాల్, సుమన్, అమల, వినోద్, సాయి, ప్రణీత్, కృష్ణ, నాగరాజు, మక్క బాబ్జి సంతు పాల్గొన్నారు.

See also  జనసేన టీమ్ జె. సి. ఎఫ్. ఆధ్వర్యంలో ప్రధాన రహదారికి మరమ్మతులు.

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి