DCMS చైర్మన్ బండి రామకృష్ణను సన్మానించిన జనసేన ఇంచార్జి సయ్యద్ జిలానీ

మచిలీపట్నం జనసేన ఇంచార్జి,ఉమ్మడి DCMS
చైర్మన్ బండి రామకృష్ణను సన్మానించిన సయ్యద్ జిలానీ.

నరసరావుపేట,జూన్ 08( జనస్వరం)

జనసేన పార్టీ కార్యాలయం లో మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు DCMS చైర్మన్ బండి రామకృష్ణని సన్మానించిన సయ్యద్ జిలాని.అనంతరం జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన DCMS చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ మచిలీపట్నం లో టిడిపి వారు మాకు 33% వాట ఇస్తేనే మేము టిడిపికి సహకరిస్తామని కరాఖండిగా చెప్పడంతో మాకు చెందవలసిన 33% వాటా అన్నిట్లో ఇస్తున్నారని అలాగే నరసరావుపేట లో కూడా అన్నిట్లో 33% వాటా ఇస్తేనే మనం సహకరిస్తామని ఓపెన్ గా చెప్పేయమని ముఖ్య నాయకులతో, తగు సూచనలు చేసినారు. పొత్తు ధర్మం పాటించటము అంటే మనకు ఎంతైతే గౌరవిస్తారో మనము కూడా అంతగానే గౌరవించాలని తెలియజేసినారు.

పల్నాడు జిల్లాలో కూటమిలో టిడిపి వ్యవహరిస్తున్న తీరును జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని వారు త్వరలో మీతో కలుస్తారని తెలియజేసినారు.

See also  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జనసేనపార్టీలోకి చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి