జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్య చంద్ర సతీసమేతంగా పార్టీ కోసం గ్రామగ్రామాన బస

జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్య చంద్ర సతీసమేతంగా పార్టీ కోసం గ్రామగ్రామాన బస

                             శ్రీ పవన్ కళ్యాణ్ గారిని 2023-24 లో ముఖ్య మంత్రి గా చేయాలన్న బలమైన లక్ష్యంతో జనసేన పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ… జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతిఒక్కరికి జనసేన పార్టీ స్థాపనకు గల కారణాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి కుటుంబానికి తెలపాలనే ఉద్దేశ్యంతో… శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో జనసేన కుటుంబంలో ఉన్న అక్క చెల్లెమ్మల, అన్న తమ్ముళ్ల సహాయ, సహకారాలతో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున 2021 మార్చి 14 సాయంత్రం 4.09 నిముషములకు జనసేన పార్టీ ఇంచార్జ్ పాతంశెట్టి సూర్యచంద్ర గారు, ఆయన సతీమణి  శ్రీదేవి ఇంటినుండి బయలుదేరి మూడు సంవత్సరములు రాత్రిపగలు గ్రామాల్లో ఉంటూ జనసేనపార్టీ బలోపేతానికి నిరంతర ప్రయత్నం చేయాలన్న ఆశయంతో నియోజకవర్గంలో ప్రతి ఇంటిని చేరి జనసేన సిద్దాంతాలను వివరించి, గ్రామాల్లో బస చేయాలన్న సంకల్పానికి నిశ్చయించుకున్నారు. 

కార్యక్రమ వివరములు..

1. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబంతో ఐదు నిమిషాలు మాట్లాడి జనసేనపార్టీ గురించి వారికి తెలిపి వారి సమస్యలు వింటూ జనసేన పాంప్లెట్లు పంచుతూ రోజుకి ఒక సామాజికవర్గం కార్యకర్త ఇంటి దగ్గర ఆయన, ఆయన భార్య రాత్రి బస చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 

2. ప్రతి గ్రామంలోనూ గ్రామ పర్యటన పూర్తి అయిన తర్వాత ప్రజలందరి సమక్షంలో జనసేన గ్రామసభ మరియు మీడియా సమావేశం నిర్వహించి గ్రామంలో గుర్తించిన ప్రజల వ్యక్తిగత సమస్యలు, గ్రామ సమస్యలపై సంబంధిత అధికారులకు మెయిల్ ద్వారా, రిజిస్టర్ పోస్టు ద్వారా మరియు గ్రామ, మండల కమిటీ అధ్యక్షుల ద్వారా దరఖాస్తులు అందజేసి ఎకనాలెడ్జ్మెంట్ తీసుకుని గ్రామ, మండల కమిటీలు ఈ సమస్యల పరిష్కారానికి పర్యవేక్షణ చేసే విధంగా ఏర్పాటు జరుగుతుంది. 
3. పార్టీలో సంఖ్యాబలం పెంచడానికి ప్రతిరోజు భోజన విరామ సమయంలో ప్రతిగ్రామంలో మహిళా, రైతు, కార్మిక మరియు విద్యార్థి సమావేశాలు ఏర్పాటు చేసి వారిని చైతన్యపరుస్తూ అన్ని వర్గాలను జనసేన పార్టీలో మమేకం చేయడం జరుగుతుంది. 
4. ప్రతిరోజూ వంద మందికిపైగా కార్యకర్తలు జనసేన జెండాలతో ఈ యాత్రలో పాల్గొని ప్రతి ఓటరుని చైతన్య పరిచేలా మాట్లాడుతూ పార్టీని ప్రజల్లోకి చొచ్చుకు పోయేలా చేయడం జరుగుతుంది. 
5. ప్రతి నెలలో 14వ తేదీన ఏగ్రామంలో ఉంటే ఆగ్రామంలోనే నియోజకవర్గ కార్యకర్తలతో పార్టీ కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల పరిష్కారాలపై సమీక్ష, సమావేశాలు జరుగును.
6. ఈ మూడు సంవత్సరముల పర్యటనలో ప్రతి గ్రామం ప్రతి కుటుంబాన్ని 5 నుండి 6 సార్లు కలిసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. 

See also  ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సమస్యను పరిష్కరించండి : జనసేనపార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

      ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ప్రతి జనసేన నాయకులు, జనసైనికులు మనస్ఫూర్తిగా కోరుకుందాం. 

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి