ఆరవ రోజుకి చేరుకున్న ఇమ్మడి కాశినాథ్ పాదయాత్ర

    మార్కాపురం ( జనస్వరం ) : వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్  ఇమ్మడి కాశీనాధ్ గారు తలపెట్టిన పాదయాత్ర ఆరవ రోజు చేరుకుంది. తర్లుపాడు గ్రామం నుండి బయలుదేరి బొడిచెర్ల, మిట్టమీదిపల్లి, తిప్పాయిపాలెం మరియు చింతగుంట్ల గ్రామాల వరకు చేరుకోవడం జరిగింది. ఈ పాదయాత్రకు జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు, కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి షేక్ సైదా, సిపిఐ పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు అందే నాసరయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు సుదర్శన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం, తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు దూదేకుల మస్తాన్, పటాన్ ఖాన్, మద్దతు తెలిపారు. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

See also  జనసైనికుల మీద కక్ష్యపూరిత కేసులు పెట్టి వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం : జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు ఆకుల రమేశ్